Total Pageviews

Wednesday, April 28, 2010

సరదా పడి..ఇబ్బంది పడ్డా|

ఓసారి మా ఇంట్లొ అద్దెకుంటున్న వాళ్ళ అబ్బాయీ సతీష్ కొత్త సైకిల్ కొన్నాడు అది నాకు బాగా నచ్చింది.ఒక సారి తొక్కుకొడానికి అడుగుదామంటే మొహమాటం వేసింది కొన్నాలకు తామంతా ఊరు వేలుతున్నామని, వారం రొజుల వరకు రామని సతిష్ చెప్పాడు.
అప్పుడు నాకు సైకిల్ తొక్కాలని అనిపించింది దానిని బయటకు తెచ్చి తొక్కడం మొదలుపెట్టా అంతలొనే సతిష్ వచ్చాడు. నేను సిగ్గుతొ తల ఎత్తలేదు.

Monday, April 26, 2010

అదిగో భద్రాద్రి-చూడగ యమ రద్దీ

మేము 2007 జనవరిలో భద్రాచలం వెళ్ళాము.8 కుటుంబాలు,32 శాల్తీలు.అంతాకలిసి ఒక సుమో,ఒక మినీ బస్ లో బయలుదేరాము.దారిలో కొత్తగూడెం దగ్గర పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఆగి దర్శనం చేసుకున్నాము.అటు నుండి పర్ణశాల కు వెళ్ళాము.నిజంగా అక్కడ ఉంది చుస్తే త్రేతా యుగంలో ఉండి చూస్తునట్టే అనిపించింది.తరువాత అక్కడినుంది నేరుగా భద్రాచలం బయలుదేరాము.అక్కడ మాకోసం ఆర్ & బి గెస్ట్ హౌస్ బూక్ చేసారు.ఇంద్ర భవనంలా ఉంది అది.తరువాత స్నానాది కార్యక్రమాలు చేసి దర్శనం కోసం వేళ్ళాము.అక్కడ ఉంది జనసందోహం.రాష్ట్రంలో ఇంత మంది భక్తులున్నారా అనిపించింది.

ఎలాగోలా తిప్పలు పడి దర్శనం చెసుకున్నాక మళ్ళీ గెస్ట్ హౌస్ కి వెళ్ళాము.తరువాతి రోజు ట్రిప్ పాపికొండలు.

తరువాతి రోజు ఉదయం అందరం బయలుడేరాము.ప్రయాణం అంతా అడవి గుండా సాగింది.నిజానికి పాపికొండలు వెళ్ళలంటే కూనవరం అనే ఊరినుండి పడవలు ఉంటై,కానీ అక్కడ నీటి మట్టం తక్కువగా ఉండడంతో మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళి రామన్నపెట అనే ఊరిలో పడవ ఎక్కాము.

దారిలోనే కూనవరం లో టిఫిన్ చేసాము,అక్కడే లంచ్ కి ఆర్డర్ ఇచ్చాము కూడా.కూనవరానికి ఒక స్పెషాలిటీ ఉంది,ఇక్కడ గోదావరినది,శబరీ నది కలుస్తాయి.ఆ దృశ్యం చూడడానికి బాగుంటుంది.ఎడమ వైపు నుండి శబరీ నది ఎర్రటి నీళ్ళతో,కుడి వైపు నుండి గోదావరి నది నల్లటి నీళ్ళతో వస్తూ మధ్యలో త్రికోణాక్రుతిలో వచ్చి కలుస్తాయి(సరిగా పోల్చడం రాలేదు).
తప్పకుండా చూడాల్సినది.

తరువాత రామన్నపేట నుండి పడవలో పాపికొండలు వెళ్ళాము.తిరుగు ప్రాయాణంలో పేరంటాలపల్లి అనే ఒక ఊరిలో ఒక మునివాటం ఉంది.అక్కడ ఆగాము,ఆ గుడి ముందునుండి ఒక సెలయెరు ప్రవహిస్తూ ఉంతుంది.చాలా స్వఛ్చంగా ఉంటాయి నీళ్ళు.

తరువాత భోజనాలు వచ్చాయి ఇంకో పడవలో,తిని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము.

మొదటి టపా

నమస్కారం అందరికీ,ఎప్పటి నుండో ప్రారంభించాలని అనుకుంటూ వాయిదా పడుతూ వస్తున్న బ్లాగును ప్రారంభించాను.ఇక టపాలు రాయడమే మిగిలింది.